బ్రహ్మశ్రీ విద్వన్మణి దుడ్డు శ్రీరామచంద్రమూర్తి వర్యులకు సమర్పించు స్తుతిరత్నమాల
స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధన నామసంవత్సర చైత్ర బహుళ పంచమీ అనగా ది.వి 10/04/1985 వ తేది బుధవారం రోజున జరిగిన సన్మాన సభలో సమర్పించిన స్తుతి రత్నమాల .ఆర్ష కవితా శాఖలపై ఆదికవి వాల్మికి ఆలపించిన మధుర రామ చరితను రమ్య మాధురీ ఝరులతో ముంచెత్తించి మందాకినీ సత్య విపంచి వీచికలు పర్వగా , లక్ష్మీ నారాయణ పాదసేవా లబ్ధ వచో విజృంభమాణ భాషా నైపుణ్యంతో విపుల వ్యాఖ్యానంతో పదునెనిమిది మాసములు రామాయణేతిహాస కేదారాన్ని శృతి స్మృతి పురాణాగమాలంకార విశేషాలతో ధారావాహికంగా పరిపూర్ణం చేసి ప్రవచనం సాగించిన ధన్యమూర్తి! సద్గురు కరుణా ప్రేరణలచేత చైతన్య వంతమైన హృదయంతో సుందర హనుమద్వైభవ విభావాతిశయంతో శ్రీ హనుమత్సీతారామ పాదారవింద ధ్యాన తత్పరులై యదృచ్ఛాలాభ సంతుష్టులై "శివమస్త్వనంతోస్త్వఖిలమస్తు" అను పరమ సంతుష్ట శాంత మూర్తి పండిత బ్రహ్మశ్రీ విద్వన్మణి దుడ్డు శ్రీరామచంద్రమూర్తి గురు వరేణ్యులకు వసంత పంచమీ పర్వ సందర్భముగా వినతి పూర్వకముగా సమర్పించుకొను స్తుతిరత్నమాల.
1.సీసపద్యము
భాషించినాడవు బహువిధ సూక్తులు
మార్మ్రోగే నీరామమండపమున
వివరించినాడవు వేల్వేల గాధలు
చిందించె నవ్వులు చెవుల నిండ
నందించి నాడవు సుందరకాండయా
గ ఫలితంబులర నీగ్రామభూమి
సాగించినాడవు సత్యరామాయణ
గాధను బహు దీర్ఘకాలమిచట
తేటగీతి
ఏమి పుణ్యంబుచే జనియించినావో
సఫలమైనది జన్మంబు సౌమ్యమూర్తి
బుధజన నిర్మల విధేయ ప్రదితకీర్తి
వేద విజ్ఞానమూర్తి పవిత్రకీర్తి
2.మత్తేభము
జననంబందితి దుడ్డు వారి వర వంశబందు విద్యానిధీ!
జననీ గర్భము ధన్యమయ్యె నిను రాజా ! రామచంద్రా! యనన్
మనసే పండెను మాదు బోంట్లకును సౌమ్యాలంకృతంబౌ భవ
ద్ఘన పాండిత్యము గాంచి మ్రొక్కితిమి సాకారేందు తేజోనిదీ
3. సీసపద్యము
పరమ పావనమైన భరత ఖండంబున
స్ఫూర్తినొందినది ఈ పుణ్య భూమి
ఏలా నదీ పుణ్య వేలాదికంబుల
దీప్తమైనట్టిదీ దివ్య భూమి
పౌరాణికాచార్య పండిత కోటిచే
పూతమైనట్టిదీ పుణ్య భూమి
నిరతాన్న దానంబులరవిచ్చునట్లుగా
భవ్య మైనట్టిదీ నవ్యభూమి
తేటగీతి
ఇమ్మహాక్షేత్రమందె నీవిట్టి దీక్ష
నొంది సాంతంబు ధన్యత నొందినావు
శైవ విష్ణ్వాది శాస్త్రార్ధ శిక్షితుండ!
కీర్తి విసరుండ! పండితాగ్రేసరుండ!
4. తేటగీతి
వేద వేదాంత సాహిత్య వీనులందు
నిన్ను బోలిన పండితుండెన్న
తలను వంచితి స్వల్పంబు ధనము కొరకు
మలచుకొంటివి పెక్కు సన్మానములకు
5. ఉత్పలమాల
కాంచన రత్నహారములు కాంచన కంకణ తారహారముల్
కాంచుచు నాశపొంది మరి కావలెనందురు పాండితీ జనుల్
వంచన లేక నీ వచన భాగ్యము సర్వము దారపోసితీ
మంచిది నీదు జన్మయును మాన్యత నొందెను పండితోత్తమా !
6. సీసపద్యము
కోట్లు గడించెడి కోటీశ్వరులు కూడ
నిర్ఘాంత పోయిరి నిన్నుజూచి
పుట్లు గడించెడి భూస్వాములైనను
విస్తుపోయిరి నీదు విద్యగాంచి
పాండిత్యమే లేని పామర జనములు
తనివినందిరి వచోధాటి గాంచి
సకల శాస్త్రంబులు చదివిన పండితుల్
తలల నూచిరిగ విద్వత్తు గాంచి
తేటగీతి
ఎటుల నేర్చినాడవొకద ఇట్టి విద్య
ఇది పురాకృత సుకృతియు యెంచి చూడ
ఏమి పుణ్యంబు చేసితి వమల కీర్తి !
మాన్య శాస్త్రార్ధ విజ్ఞాన ధన్య కీర్తి!
7. తేటగీతి
ఇట్టి పాండితి గ్రహించుటెట్లబ్బెనౌ
రా ! పురాణపండ రామమూర్తి
గారి శిష్యులగుట కాబోలరసి చూడ
విబుధ జన విధేయ విమల చరిత!
8. శార్దూలము
ఈ వీటన్ నినుబోలు పండితులు లేరీ నాటి కాలంబునన్
నేవేదంబు వచింప పండితుడనా నీరాజనంబిచ్చి, సు
శ్రీ వాక్యంబులు పల్క వేద పటనా జేగీయ శాలుండవా!
కైవారంబులు సల్పుచుంటినివిగో కావ్యజ్ఞ శిక్షాగ్రణీ !
రచన :- శ్రీ కేసాప్రగడ సత్యనారాయణ
సమర్పణ :- శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానం ,
పురాణ భక్త మండలి ,
కిర్లంపూడి,
తూర్పుగోదావరి జిల్లా,
ఆంధ్రప్రదేశ్ - 533431

No comments:
Post a Comment