ఓం శ్రీ మహాగణాధిపతయేనమః
ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే
ఓం అమరికమరిభార ముఖరీకృతం
దూరీ కరోతు దురితం గౌరీ చరణ పంకజం
వివాహమనగానేమి?
మన పూర్వులు వధూవరులను ఒకటి చేసే ప్రక్రియకు వివాహమని ఉదాత్తమైన పేరును నిర్ణయించారు .
ఎక్కడో ఒక ప్రదేశంలో స్త్రీ జన్మించింది, ఎక్కడో ఒక ప్రదేశంలో పురుషుడు జన్మించాడు. వీరు వారి వారి పరిస్థితులను బట్టి పెరిగి పెద్దవారు అవుతున్నారు. వీరిద్దరినీ కలిపి ఏకీభావము చేయుటయే వివాహ సంస్కారము.
వివాహమునకు ఎన్నో పేర్లు ఉన్నాయి .
1.కల్యాణం
2.పాణిగ్రహణం
3.ఉద్వాహం
4.పాణిపీడనం
5.పాణిపరిగ్రహణం
6.దారోపసంగ్రహణం
7.దారపరిగ్రహణం
8.దారక్రియ
9.దారకర్మ
10.పరిణయం మొదలగునవి
వివాహము చేసుకునే పద్ధతిని అనుసరించి ఎనిమిది విధములుగా చెప్పబడింది.
అవి
1.బ్రాహ్మం
2.దైవం
3.ఆర్షం
4.ప్రాజాపత్యం
5.ఆసురం
6.గాంధర్వం
7.రాక్షసం
8.పైశాచికం
అని మహాభారతంలో చెప్పబడింది.
1.బ్రాహ్మం:-మంచి కుటుంబంలో మంచి లక్షణములుగల యోగ్యుడైన వరునకు సలక్షణ సంపన్నమైన యోగ్యమైన కుటుంబమునందు జన్మించిన సాలంకృతమైన కన్యను ఉదకదారా పూర్వకముగా కన్యాదానము చేయుట.వీరికి పుట్టిన సంతానము ద్వారా అటు పది తరాలు , ఇటు పది తరాలు తరించును.
2.దైవం :-యజ్ఞకర్త తను చేయబోవు యజ్ఞమునకు వరించిన ఋత్విక్కునకు తన కన్యను సాలంకృతముగా ఇచ్చుట.
వీరి సంతానము ద్వారా ఇటు ఏడు తరములు , అటు ఏడు తరములు తరించును.
3.ఆర్షం:- వరుని దగ్గరినుండి రెండు పాడి ఆవులను తీసుకొని తన కన్యను అతనికి ఇచ్చుట.ఈ దంపతులకు పుట్టిన సంతానము ద్వారా ఇటు మూడు తరాలు, అటు మూడు తరాలు తరించును.
4.ప్రాజాపత్యం:- ఇది లగాయతు నేటినుండి మీరిద్దరూ అన్యోన్యంగా ఉండుడని ఆదేశిస్తూ గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వహిస్తూ ఉండుడని ఆదేశించుట .వీరి సంతానము వలన ఇటు ఆరు తరాలు, అటు ఆరు తరాలు తరించును.
5.ఆసురం:-కన్యను కొంత డబ్బు ఇచ్చి అనగా కన్యాశుల్కం ఇచ్చి వివాహం చేసుకొంటే ఆ వివాహమును ఆసురం అంటారు. వీరి సంతానము వలన ఫలితం ఉండదు.
6.గాంధర్వం:-యువతీయువకులు పరస్పరానురాగాన్ని పెంచుకొని ,పెద్దలకి ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా చేసుకొనే వివాహం. ఇలాంటి వివాహం కేవలం భౌతిక దృష్టి వల్ల ఏర్పడేదేకాని అందులో ధార్మిక దృష్టికి అవకాశం లేదు.దీనివల్ల ముందువెనుక తరాలేవి తరించవు సరిగదా ప్రస్తుతం జరుగుతున్న తరానికి మనశ్శాంతి ఉండదు.
ఇలాంటి వివాహం వల్ల సమాజగమనం దెబ్బతింటుంది. ఇది రాజులకు ఆపద్ధర్మంగా అంగీకరింపబడింది.
7.రాక్షసం:-వివాహానికి ముందు కన్యకు సంబంధించినవారితో యుద్ధం చేసి కన్యను అపహరించి ఎక్కడికో తీసుకొని వెళ్లి వివాహం చేసుకొనుట.రాక్షసవివాహం కూడా సర్వసాధారణం కాదు. ఇది కూడా క్షత్రియులకు మాత్రమే పరిమితమైనది.పరాక్రమాన్ని పణంగా పెట్టి కన్యను అపహరించి వివాహం చేసుకోవడం క్షత్రియుడికి మాత్రమే చెల్లుతుంది.ఇందులోనూ ధార్మికదృష్టి కంటే భౌతికదృష్టియే అధికం.
8.పైశాచికం:- కన్యపై మనసు పడితే ఆమె నిరాకరిస్తుంది. తరువాత మాయతో ఆమెకు నచ్చినవాడి వేషంలో వచ్చి మోసగించి పెళ్లి చేసుకోవడం. అలాగే కన్య నిద్రిస్తున్నపుడు శీలాన్ని అపహరించి పెళ్ళిచేసుకోవడం కూడా పైశాచికం అవుతుంది.ఇది చాలా నీచమైన వివాహము.మాయతో మోసంతో ఏర్పడిన వివాహము ఎంతో కాలము నిలువదు.పవిత్రమైనబంధం కాదు కాబట్టి పదిమంది చేసే అవమానాలను భరించవలసి వస్తుంది.
కన్యా లక్షణాలు
వివాహం చేసుకోబోయే కన్య ఉత్తమ సాముద్రిక లక్షణాలు, మంచి దేహపుష్టి , మంచి వర్చస్సు కలిగి ఉండాలి.ఆమె మంచి కుటుంబంనుండి వచ్చినది అయి ఉండాలి.దీని వల్ల మంచి సంతానం కలిగి వంశవృద్ధి అవుతుందని పెద్దలు చెబుతారు.కన్య వరునికి సోదరి వరుస కాకూడదు. వరునికి భిన్న గోత్రంలో జన్మించినది అయి ఉండాలి. ఇలాంటి గుణములను పరీక్షించి కన్యను ఎన్నుకున్నట్లయితే ఆమెకుకలిగే సంతానం ఆరోగ్యంతో కళకళలాడుతూ ఉంటుంది.
కన్యను చూడడానికి వరుడుగాని అతనికి సంబంధించిన వాళ్ళు గాని వెళ్లినప్పుడు ఆమె నిద్రపోతూ ఉన్నా, ఇంట్లో లేక పోయినా ,దుఃఖంతో ఉన్నా ఆ సంబంధాన్ని వదిలి వేయడం మంచిది.అంతేగాక క్రింద వివరించబడిన గుప్త, రిషభ, శరభ, వినత, వికట, ముండ, మండూశిక, సాంకరిక, రత, పాళీ, అనే కన్యలను కూడా వదిలి పెట్టడం మంచిది.ఈ కన్యల వివరణ
1.గుప్త:- తల్లిదండ్రులు నిర్బంధించి ఇంట్లో రహస్యంగా దాచిన కన్యను పెండ్లి చేసుకొనరాదు.

2.రిషభ:- మోటు శరీరం, లావైన వెండ్రుకలు, కలిసిన కనుబొమ్మలు, పిక్కలమీద వెండ్రుకలు, కాలి చిటికెన వ్రేళ్ళు నేలమీద ఆనకపోవడం, మొగవాడి గొంతు, కళ్లు ఆర్పడం, నవ్వినప్పుడు కళ్లు ముయ్యడం, బుగ్గలు సొట్టపడడం మొదలగు లక్షణాలు గల కన్య.
3.శరభ:- అతి సౌందర్యవతి. వేశ్యా లక్షణాలతో అతి కాముకత్వాన్ని ప్రదర్శించేది.ఇతరులను ఆకర్షించడానికి ఎప్పుడూ అలంకారాలను చేసుకొనేది.
4 .వినత:- గూనితనం, మెడ , నడుము వంగి ఉండడం, ముసలితనపు లక్షణాలు అంకురించడం ఎవరిలో కనిపిస్తాయో ఆమెను వినత అంటారు.
5.వికట:- నడుము నుంచి మోకాళ్ళ వరకు వచ్చే భాగం కంటే మోకాళ్ళనుంచి పాదాలవరకు గల భాగం పొడుగు ఎక్కువగా ఉండి పిక్కలు మరీ లావుగా ఉంటే ఆమెను వికట అంటారు.
6.మండూశిక:- పొట్టిగా ఉండి గరుకైన చర్మం గలది మండూశిక అవుతుంది.
7.ముండ:- అనారోగ్యం వల్ల, ఇతర కారణాల వల్ల జుట్టు తీసివేసినదాన్ని ముండ అంటారు.
8.సాంకరిక:- వంశం వగైరా తెలియనిది, విభిన్న సాంప్రదాయాలు గల స్త్రీ,పురుషులకు పుట్టినది
9.రత:- మంచి అలవాటు గానీ, పరిశుద్ధి గానీ లేని కుటుంబంలో పుట్టినది.
10.పాళీ:- దాసీ వృత్తిలో పిల్లలను పెంచడం జీవనంగా గలది.
11.మిత్ర:- ఎక్కువ మగవాళ్ళతో స్నేహం చేసేది.
12.వర్శకరి:- వరునికంటే వయసులో పెద్దది వర్శకరి అనబడుతుంది. అలాగే ఎప్పుడూ చెమట పోసే శరీరం కలది కూడా వర్శకరి అనబడుతుంది.
ఇలాంటి కన్యలను వివాహం చేసుకోకూడదు. ఈ దోషాలు లేకుండా చూసుకొని సంబంధాన్ని నిశ్చయం చేసుకోవాలి.
వివిధ శాస్త్రాలు పరిశీలించిన మీదట మనకు ఈ క్రింది విషయం బోధపడుతుంది.
కన్యా వరయతే రూపం మాతా విత్తం పితా శృతం
బాన్ధవాః కులమిచ్చంతి మృష్టాన్నమితరే జనాః
కన్య అందమైన వరుడు కావాలని కోరుకొనును. కన్యతల్లి వరుడు బాగా డబ్బు గలవాడు అయితే బాగుండును అనుకొనును .
తండ్రి కుటుంబ మర్యాదలు ఆలోచించును. బంధువులు సౌశీల్య గుణాదులు ఆలోచింతురు. ఇతర జనులు పప్పుఅన్నం కోరుకొందురు.
వర లక్షణాలు
వరుడు మంచి వంశంలో పుట్టినవాడై కులీనుడై ఉండాలి. బంధు సంపత్తి కలిగిన వాడు, పదిమంది మెచ్చిన స్వభావం కలవాడు అయి ఉండాలి. సాముద్రిక శాస్త్ర లక్షణ యుక్తుడై, ఆరోగ్యంతో, ఆహ్లాదంతో కూడినవాడై ఉండాలి. దర్శనీయుడుగ లేనివాడు, సగోత్రీకుడు సంబంధానికి సరిపోడు. సౌందర్య, సౌశీల్యాలతో కూడిన వాడిని వరుడిగా ఎన్నుకోవాలి.

ఆశ్రమములు
ఆశ్రమములు నాలుగు విధములు
1.బ్రహ్మచర్యాశ్రమం
2.గృహస్దాశ్రమం
3.వానప్రస్థాశ్రమం
4.సన్యాసాశ్రమం
వీటిని ఏ సమయంలో ఆచరించవలేనో మనకి మహాకవి కాళిదాసు వివరించెను.
ఆ వివరాలు
ఆ వివరాలు
శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం
వార్ధక్యే మునివృత్తీనాం యోగినాంతే తనుచ్యతాం
యథా మాతరమాశ్రిత్య సర్వే జీవంతి జన్తవః
తథా గృహస్థమాశ్రిత్య సర్వే జీవంతి మానవః
గృహస్థః ఏవ జయతే గృహస్థః తప్యతే తపః
చతుర్ణాం ఆశ్రమానాం తు గృహస్థః తు విశిష్యతే